No Entry-2: బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సీక్వెల్‌లో తమన్నాకు పోటీగా మరో యంగ్ బ్యూటీ..

by Chukka Sudharani |

సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో బాలీవుడ్ (Bollywood) ‘నో ఎంట్రీ 2’ (No Entry-2) ఒకటి.

No Entry-2: బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సీక్వెల్‌లో తమన్నాకు పోటీగా మరో యంగ్ బ్యూటీ..
X

దిశ, సినిమా: సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో బాలీవుడ్ (Bollywood) ‘నో ఎంట్రీ 2’ (No Entry-2) ఒకటి. 2005లో వచ్చిన ‘నో ఎంట్రీ’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ (Salman Khan), అనిల్ కపూర్ (Anil Kapoor) అండ్ ఫర్ధీన్ ఖాన్ (Fardeen Khan) నటించగా.. సూపర్ హిట్ అందుకుంది. అయితే.. గతంలో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ ప్రకటించాడు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor). అంతే కాకుండా ఈ సీక్వెల్‌లో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ అండ్ దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక అనౌన్స్‌మెంట్ నుంచి ఈ మూవీ భారీ అంచనాలు క్రియేట్ కాగా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. తాజాగా ‘నో ఎంట్రీ 2’ లో నటించే హీరోయిన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. నిర్మాత బోనీ కపూర్ హీరోయిన్స్‌ను సెలక్ట్ చేసే పనిలో ఉండగా.. ఇప్పటికే ఇందులో మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannaah)ను ఫిక్స్ చెయ్యగా.. సెకండ్ హీరోయిన్‌గా అదితిరావు హైదరి (Aditi Rao Hydari) కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా అదితి దాదాపు సెట్ అయిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం 2025 ఆగస్టు నుంచి సెట్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు మేకర్స్.

Next Story