- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నషా సునామీ.. కథ కంటే పాటకే ఎక్కువ హోరు.. కానీ..!
కొన్నిసార్లు ఒక పాట సినిమా కథను కూడా డామినేట్ చేస్తుంది. దాని శబ్దంతో, దాని దృశ్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : కొన్నిసార్లు ఒక పాట సినిమా కథను కూడా డామినేట్ చేస్తుంది. దాని శబ్దంతో, దాని దృశ్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సరిగ్గా అలాంటి మాయే చేసింది 'రైడ్ 2'లోని తమన్నా భాటియా తనదైన శైలిలో కుమ్మేసిన 'నషా' పాట. విడుదలైన క్షణం నుంచి ఈ పాట ఒక సునామీలా దూసుకుపోయింది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ అతి తక్కువ సమయంలోనే 44 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. ఇటీవల తమన్నా నటించిన 'ఒదెల 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, 'నషా' మాత్రం ఆమె కెరీర్‌కు ఒక ఊపిరినిచ్చింది. ఆమెను మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు అందరూ తమన్నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె అందం, ఆమె డ్యాన్స్, ఆమె గ్లామర్.. అన్నీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే, ఈ విజయం వెనుక వివాదాల నీడలు కూడా ఉన్నాయి. 'రైడ్ 2' అసలు కథలో 'నషా' పాట ఒక భాగం కాదని, కేవలం సినిమాకు పబ్లిసిటీ కోసమే దానిని బలవంతంగా చొప్పించారని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఈ పాట వల్లే సెన్సార్ బోర్డు సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చిందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఆరోపణలు నిర్మాతలను కలవరపెట్టాయి. వారు వెంటనే స్పందించి ఈ ఊహాగానాలకు ఒక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.
అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కించారు. సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వివాదాల గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, "ఈ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. సెన్సార్ బోర్డు 'యు' సర్టిఫికెట్ కోసం కొన్ని కట్స్ సూచించిన మాట నిజమే. కానీ, కథ సహజత్వాన్ని చెడగొట్టకూడదని మేము వాటిని తొలగించకూడదని నిర్ణయించుకున్నాం. 'నషా' పాట సినిమా కథలో ఒక ముఖ్యమైన భాగం. ఇది హఠాత్తుగా చివరలో చేర్చిన పాట కాదు. సినిమా థ్రిల్లర్ అయినా కాకపోయినా, ఈ పాట కథ మూడ్‌కు సరిగ్గా సరిపోతుంది" అని ఆయన తేల్చి చెప్పారు.
ఇంతటితో అంతా సద్దుమణిగిందని అనుకుంటే, అభిమానులు మరో ప్రశ్నతో సిద్ధంగా ఉన్నారు - 'రైడ్ 3' ఉంటుందా అని! 'నషా' పాట సృష్టించిన ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే, భవిష్యత్తులో తమన్నాకు మరో అదిరిపోయే పాట దక్కే అవకాశం లేకపోలేదు.






