క్రేజీ కాంబినేషన్.. నాగార్జున సినిమాలో 54 ఏళ్ల భామ !

by velandi.Saikiran |

నాగార్జున కింగ్ 100 సినిమాలో టబు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

క్రేజీ కాంబినేషన్.. నాగార్జున సినిమాలో 54 ఏళ్ల భామ !
X

దిశ‌, వెబ్ డెస్క్: అక్కినేని నాగార్జున ( Nagarjuna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగారు నాగార్జున. ఇప్పటికీ యువ హీరోగానే క‌నిపిస్తూ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నారు. అయితే అలాంటి అక్కినేని నాగార్జున 100వ (King100 ) సినిమా చేయబోతున్నాడు.. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్, గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైంది.

యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున చాలా డిఫరెంట్ గా కనిపిస్తారట. అయితే ఈ సినిమాలో 54 ఏళ్ల టబు ( Tabu) నటించబోతున్నట్లు ముందు నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా ట‌బు క్లాప్ బోర్డును సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఫాన్స్ సంబరపడిపోతున్నారు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున, టబు నటించగా... ఆవిడ మా ఆవిడే అనే సినిమా కూడా ఈ ఇద్దరి కాంబోలో వచ్చింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కాగా ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story