- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ లో కొత్తగా లేడీ విలన్.. 53 ఏళ్ళ వయసులో ?
సీనియర్ హీరోయిన్ టబు ( Tabu ) గురించి తెలియని వారు ఉండరు. 53 సంవత్సరాలు దాటినా కూడా... టాలీవుడ్ అలాగే బాలీవుడ్

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ టబు ( Tabu ) గురించి తెలియని వారు ఉండరు. 53 సంవత్సరాలు దాటినా కూడా... టాలీవుడ్ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీని ( Bollywood) ఒక ఊపు ఊపేస్తున్నారు హీరోయిన్ టబు. హైదరాబాద్ నగరంలో ( Hyderabad) పుట్టి పెరిగిన ఈ అందాల తార... ముంబైలోనే ( Mumbai) సెటిల్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywwod ) కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అప్పట్లో... అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) సరసన వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ... ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.... అలా వైకుంఠపురం సినిమాలో తల్లి పాత్రలో కనిపించింది.
ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో... ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అయితే టబు వయసు 53 సంవత్సరాలు దాటినా కూడా... తెలుగులో అవకాశాలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలోనే... టబుకు పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) ఆఫర్ ఇచ్చారట. తన నెక్స్ట్ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం హీరోయిన్ టబు ను అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి ( Vijay Sethupathi) కాంబినేషన్ లో ఓ ఊర మాస్ సినిమా రాబోతుంది. అయితే ఇందులో.. టబుకు ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారట. అయితే ఈ పాత్రలో నెగిటివ్ సేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇక ఈ విలన్ పాత్రకు టబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మే నెలలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.






