Taapsee Pannu: క్రేజీ సీక్వెల్‌తో రాబోతున్న తాప్సీ.. డైరెక్టర్ ఎవరంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-19 14:27:54  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

Taapsee Pannu: క్రేజీ సీక్వెల్‌తో రాబోతున్న తాప్సీ.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక గత ఏడాది ‘పిర్ హసీన్ దిల్‌రూబా’(Pir Haseen Dilruba) చిత్రంతో వచ్చి మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తాప్సీ పన్ను ఓ క్రేజీ సీక్వెల్‌తో రాబోతున్నట్లు సమాచారం. 2018లో వచ్చిన హిట్ మూవీ ‘ముల్క్’ కోర్టు రూమ్ డ్రామాగా వచ్చి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఓ ముస్లిం కుటుంబం ఎదుర్కొనే మ‌త‌త‌త్వానికి సంబంధించిన క‌థ‌గా ముల్క్ తెర‌కెక్కింది.

ముస్లిం కుటుంబానికి చెందిన మురాద్ అలీ మొహ‌మ్మద్ ఉగ్రవాదంలో చిక్కుకున్న త‌ర్వాత కోల్పోయిన గౌర‌వాన్ని తిరిగి పొంద‌డానికి చేసే ప్రయ‌త్నంగా ముల్క్ రూపొందింది. ఆక ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది. అనుభవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ, రిషి కపూర్(Rishi Kapoor), రజత్ కపూర్(Rajat Kapoor), మనోజ్ పహ్వా, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానా, నీనా గుప్తా, ప్రాచీ షా పాండ్యా నటిస్తున్నారు. అయితే ఇందులో పౌర హక్కులకు సంబంధించిన అంశాలను పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story