అఖండ -2 తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-23 15:53:57  IST  )

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవెయిటెడ్ హై యాక్షన్ సినిమా అఖండ -2.

అఖండ -2 తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవెయిటెడ్ హై యాక్షన్ సినిమా అఖండ -2. అఖండ సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా వస్తోన్న అఖండ -2 నుంచి చిత్రబృందం అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. తాండవం సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.

ప్రోమోలో బాలకృష్ణను సాక్షాత్తూ పరమశివుడే నేలపైకి వచ్చాడా అన్నట్లు చూపించారు. హిమాలయాల్లో శివాలయాల నడుమ ఒంటినిండా విభూదితో రౌద్రమైన కళ్లతో ఢమరుకాన్ని చేతబూని అఘోర లుక్ లో కనిపించారు బాలయ్య. అఖండ తాండవం అంటూ వచ్చిన లిరిక్ కు బ్యాగ్రౌండ్ లో ఇచ్చిన స్కోర్ గురించైతే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ కన్ఫర్మ్. శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించిన ఈ పాట లిరిక్స్ ను కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించారు. నవంబర్ 14వ తేదీన పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Next Story