- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SV Krishna Reddy : నాగార్జునతో అందుకే సినిమా ఆగిపోయింది
SV Krishna Reddy : నాగార్జున గారితో రాజ్ కుమారుడు అనే సినిమా చేయాలనుకున్నాను. దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందని, మా నిర్మాత అంత పెట్టలేను అన్నారు. దానితో ఆ సినిమా ఆగిపోయింది అని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్లలో ఎస్. వి. కృష్ణారెడ్డి ఒకరు. ఈయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ దర్శకుడు ఎక్కువ శాతం చిన్న, మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోలతో ఈయన తీసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్న దాఖలాలు కాస్త తక్కువే. ఈయన స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న సమయంలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునతో 'వజ్రం' అనే చిత్రాన్ని రూపొందించాడు.
ఇది కృష్ణారెడ్డి గత చిత్రాలతో పోలిస్తే అంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ ఈ దర్శకుడు నాగార్జునతో ముందుగా 'రాజ్ కుమారుడు' అనే సినిమాను తీయాలి అనుకున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆ కథతో కాకుండా మరో కథతో 'వజ్రం' అనే పేరుతో చిత్రాన్ని రూపొందించారు. తాజాగా కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో నాగార్జునతో అనుకున్న 'రాజ్ కుమారుడు' సినిమా ఎందుకు ఆగిపోయింది అనే వివరాలను తెలియజేశాడు.
కృష్ణారెడ్డి మాట్లాడుతూ... "నాగార్జున గారితో 'రాజ్ కుమారుడు' అనే ఓ భారీ సినిమాను తీయాలి అనుకున్నాను. కానీ దానికి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఇక ఆ సినిమా నిర్మాత నర్సారెడ్డి అంత బడ్జెట్ అనగానే నా వల్ల కాదు అన్నాడు. దానితో నేను నాగార్జునతో తీయాలి అనుకున్న ఆ భారీ బడ్జెట్ మూవీని చేయలేకపోయాను. దానితో వేరే కథతో, వేరే సినిమా చేశాను. ఆ స్టోరీతో సినిమా చేసి ఉంటే మరీ బాహుబలి స్థాయి చిత్రం కాకపోయినా అద్భుతమైన మూవీ మాత్రం అయ్యుండేది" అని కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.






