- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suzhal – The Vortex Season 2: సస్పెన్సింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా ‘సుజల్: ది వొర్టెక్స్ 2’ ట్రైలర్..
కాథిర్ (Kathir), ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), ఆర్. పార్తిబన్, హరీశ్, ఉత్తమన్, శ్రియారెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సుజల్: ది వొర్టెక్స్’ (Suzhal – The Vortex).

దిశ, సినిమా: కాథిర్ (Kathir), ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), ఆర్. పార్తిబన్, హరీశ్, ఉత్తమన్, శ్రియారెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సుజల్: ది వొర్టెక్స్’ (Suzhal – The Vortex). క్రైమ్ థ్రిల్లర్ (crime thriller) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌ను ‘పుష్కర్-గాయత్రి’ క్రియేట్ చేయగా.. బ్రహ్మ జి, అనుచరణ్ మురుగేయన్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన ఈ తమిళ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సుజల్: ది వొర్టెక్స్ 2’ (Suzhal – The Vortex Season 2) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 28 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా సుడల్: ది వొర్టెక్స్ 2 నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) విడుదల చేసిన ఈ ట్రైలర్.. ‘నేను చేసింది హత్యే.. నా చెల్లెలను చంపినందుకు రివేంజ్ తీర్చుకున్నాను’ అంటూ ఐశ్వర్య రాజేశ్ డైలాగ్‌తో స్టార్ట్ కాగా.. సస్పెన్సింగ్ సీన్స్‌తో, థ్రిల్లింగ్ అంశాలతో విశేషంగా ఆకట్టుకుంటోంది.






