- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’ ట్రైలర్ రిలీజ్.. భయపెట్టేందుకు వచ్చేస్తున్న వేదిక
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘ఫియర్’(Fear).

దిశ, సినిమా: హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘ఫియర్’(Fear). ఈ చిత్రాన్ని దత్తాత్రేయ(Dattatreya) మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి(Sujatha Reddy) కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని(Haritha Gogineni) ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తాజాగా, ఈ రోజు ‘ఫియర్’ మూవీ ట్రైలర్ ను హీరో మాధవన్(Madhavan) సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
‘‘ఫియర్’ ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్న మాధవన్.. ట్రైలర్ థ్రిల్ చేసిందని చెప్పారు. అలాగే టీమ్ కు తన బెస్ట్ విషెస్ అందించారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సింధు(వేదిక)ను చిన్నప్పటి నుంచి మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ఎవరో తనను వెంటాడుతున్నట్లు భయపడుతుంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ధైర్యం చెప్పినా సింధును ఈ ఫియర్ వదలదు. ఆమె జీవితంలో కొన్ని ఘటనల తర్వాత చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పిస్తారు. సింధును వెంటాడుతున్న ఆ బూచోడు ఎవరు, ఆమెను ఎందుకు భయపెడుతున్నాడు అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చివరలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ చేసింది.






