Surya: జీవితంలో విజయం సాధించాలంటే మీరు చేయాల్సింది ఇదే.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

తమిళ స్టార్ సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘కరుప్ప’ ఒకటి.

Surya: జీవితంలో విజయం సాధించాలంటే మీరు చేయాల్సింది ఇదే.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘కరుప్ప’ ఒకటి. ఆర్.జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై రూపొందుతోన్న ఈ మూవీ‌లో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్వాసిక, ఇంద్రన్స్, యోగిబాబు, శశివాడ, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

రీసెంట్‌గా ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రాబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సూర్య సక్సెస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ముందుగా.. జీవితంలో విజయం సాధించడానికి ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే.. మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. అలాగే రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకూడదు. అలా చేస్తే అదే జీవితంలోని మరొక స్థాయిలో విజయం సాధించే అవకాశాలను పెంచుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. లింక్

Next Story