హీరో సూర్య కన్నీళ్లు..వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

సీఎం స్టాలిన్, రజినీకాంత్ తో పాటు చాలామంది ప్రముఖులు ఆయనకు నివాళులు

హీరో సూర్య కన్నీళ్లు..వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఏబీఎన్ స్టూడియోస్ అధినేత ఏం శరవణన్ మరణించిన సంగతి తెలిసిందే. 85 సంవత్సరాల శరవణన్, అనారోగ్యం కార‌ణంగా మరణించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే నిర్మాత ఏం శరవణన్ భౌతిక కాయానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం స్టాలిన్, రజినీకాంత్ తో పాటు చాలామంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే ఏం శరవణన్ పార్థివ దేహాన్ని చూస్తూ తమిళ హీరో సూర్య, ఆయన తండ్రి శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య నటించిన సుందరాంగుడు, వీడొక్కడే సినిమాలను ఏవీఎం సంస్థ అత్యధికంగా తెర‌కెక్కించిన‌ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరో సూర్య ఫ్యామిలీ కాస్త ఎమోషనల్ అయింది. క్లిక్

Next Story