ఆ డైలాగ్ వద్దంటే వద్దని సూర్య నాతో గొడవపడ్డారు.. ఆర్జే బాలాజీ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మొదట్లో సూర్య సార్ ఆ డైలాగ్ చెప్పడానికి అస్సలు సిద్ధంగా లేరని తెలిపారు. తానే ఆయన్ని చాలా బలవంతం చేశానని, తన ఇతర సినిమాల పేర్లను కూడా ఉదాహరణగా చెప్పి ఒప్పించాల్సి వచ్చిందని అన్నారు

ఆ డైలాగ్ వద్దంటే వద్దని సూర్య నాతో గొడవపడ్డారు.. ఆర్జే బాలాజీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం.. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై ఇక్కడి ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న నేపథ్యంలో, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జే బాలాజీ ఈ చిత్రంలోని ఒక పాపులర్ డైలాగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమాలో వచ్చే "మూకుత్తి అమ్మన్‌కు మూడు టికెట్లు ఉన్నాయి"అనే డైలాగ్ గురించి ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య సార్ ఆ డైలాగ్ చెప్పడానికి అస్సలు సిద్ధంగా లేరని తెలిపారు. తానే ఆయన్ని చాలా బలవంతం చేశానని, తన ఇతర సినిమాల పేర్లను కూడా ఉదాహరణగా చెప్పి ఒప్పించాల్సి వచ్చిందని అన్నారు. సూర్య సార్ మాత్రం ఆ డైలాగ్ వద్దు అని చెప్తూనే వచ్చారని బాలాజీ గుర్తు చేసుకున్నారు.

సినిమా విడుదలకు కేవలం ఒక వారం ముందు కూడా సూర్య సార్ తన దగ్గరికి వచ్చి, ఆ డైలాగ్‌ను సినిమా నుండి తీసేయమని గొడవపడ్డారని బాలాజీ చెప్పారు. మన మూవీస్‌లో ఇతరుల చిత్రాలను ఎగతాళి చేయకూడదని సూర్య అన్నారని, ఆయన నిజంగా చాలా మంచి వ్యక్తి అని ప్రశంసించారు. అయితే తాను మాత్రం సూర్య సార్‌తో.. "ఈ సినిమాకి దర్శకత్వం వహించింది నేను సార్.. ఏమీ పర్లేదు, చూసుకుందాం" అని చెప్పి ఆ సీన్‌ను అలాగే ఉంచేశానని వివరించారు. థియేటర్లలోకి వచ్చాక ఆ పర్టిక్యులర్ డైలాగ్‌కి థియేటర్లన్నీ చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయాయని బాలాజీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ‘మూకుత్తి అమ్మన్’ మూవీ నేరుగా ఓటీటీ (OTT) లో విడుదలైంది. మరి ఓటీటీలో వచ్చిన సినిమాకి థియేటర్ టికెట్లు ఎలా కొంటారనే లాజిక్‌ను జనాలు పెద్దగా ప్రశ్నించరని తాను ముందే అనుకున్నట్లు బాలాజీ నవ్వుతూ చెప్పారు.

Next Story