విక్రమ్ కె కుమార్‌తో సూర్య మూవీ ఫిక్స్.. క్రేజీ బ్యానర్‌లో భారీ ప్లాన్

by Pulgam srinivas |

సూర్య - విక్రమ్ కె కుమార్ కాంబోలో రూపొందబోయే కొత్త చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు సమాచారం.

విక్రమ్ కె కుమార్‌తో సూర్య మూవీ ఫిక్స్.. క్రేజీ బ్యానర్‌లో భారీ ప్లాన్
X

దిశ, వెబ్ డెస్క్: సూర్య తాజాగా ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా సూర్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘24’ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకుంది. ఇక సూర్య - విక్రమ్ కె కుమార్ కాంబోలో రూపొందబోయే కొత్త చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘24’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరి కలయికలో మరో సినిమా రానుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story