- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karuppu: విజయ్తో చేయాలనుకున్న.. ఆర్జే బాలాజీ
దర్శకుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ... కరుప్పు చిత్రాన్ని మొదట విజయ్ హీరోగా చేయాలనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదని చెప్పుకొచ్చారు

దిశ, వెబ్ డెస్క్: తమిళనాట నటుడిగా, దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆర్జే బాలాజీ ఒకరు. ఈయన ప్రస్తుతం సూర్యతో 'కరుప్పు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను మే 14న విడుదల చేయనున్నారు. దాంతో బాలాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఈ చిత్రం గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ… 'కరుప్పు' చిత్రాన్ని మొదట విజయ్తో చేయాలి అనుకున్నానని తెలిపారు. ఆయనను కలిసి కథ కూడా వినిపించానని, విజయ్‌కు స్టోరీ బాగా నచ్చిందని చెప్పారు.
అంతేకాకుండా, "నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను, వెంటనే సినిమా స్టార్ట్ చేయగలవా?" అని విజయ్ అడిగారని వెల్లడించారు. అయితే తాను కొంత సమయం కావాలని చెప్పినట్లు, కానీ ఆ సమయంలో ఇద్దరికీ ఉన్న పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని బాలాజీ వివరించారు. అనంతరం సూర్యను కలిసి ఇదే కథను వినిపించగా, ఆయనకు కూడా కథ నచ్చడంతో ఇద్దరం కలిసి ఈ సినిమాను చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. 'కరుప్పు' సినిమాపై ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.






