శరవేగంగా ‘సూర్య-47’ షూటింగ్.. ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయంటున్న నస్లెన్

by Mallepaka Hamsa |

తన ప్రమేయం లేకుండా కూడా డైరెక్టర్ కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారని, కాబట్టి ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయని హింట్ ఇచ్చాడు.

శరవేగంగా ‘సూర్య-47’ షూటింగ్.. ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయంటున్న నస్లెన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెడుతూ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల ‘కరుప్పు’ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘సూర్య-47’ పై పూర్తి ఫోకస్ పెట్టాడు. ‘ఆవేశం’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మాలీవుడ్ యంగ్ హీరో నస్లెన్ కె. గపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. జగరమ్ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణంలో సూర్య, జీతూ మాధవన్ కూడా భాగస్వాములుగా ఉన్నారు. మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ విశేషాలపై యంగ్ హీరో నస్లెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ‘సూర్య-47’ షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోందని, ఇది వచ్చే జూన్ చివరి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పాడు. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ మొత్తాన్ని తామంతా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపాడు. షూటింగ్ సెట్స్‌లో తన తమిళం చాలా బాగుందని సూర్య సర్ ప్రత్యేకంగా అభినందించారని నస్లెన్ సంతోషం వ్యక్తం చేశాడు. సూర్య గురించి నస్లెన్ మాట్లాడుతూ.. "సూర్యసార్ చాలా పెద్ద స్టార్ అయినప్పటికీ అందరితో వినయంగా ఉంటారు ఆయనకు అస్సలు గర్వం లేదు. షూటింగ్‌లో అనేక సందర్భాల్లో నేను నిజంగానే సూర్య సర్ పక్కన నిలబడ్డానా? అని నాలో నేనే ఆశ్చర్యపోయాను. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయనే నాకు అత్యంత ఇష్టమైన నటుడు. అలాంటి స్టార్‌తో కలిసి నటించడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన ప్రమేయం లేకుండా కూడా డైరెక్టర్ కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారని, కాబట్టి ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయని హింట్ ఇచ్చాడు. ఆ మధ్య ఒక పోరాట సన్నివేశంలో మోహన్‌లాల్ గారి పాట ఏమైనా ఉందో లేదో తనకు పూర్తిగా తెలియదని, కానీ సినిమాలో మాత్రం ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయని నస్లెన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌తో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది.

Next Story