Supritha: ఆ నరకం తట్టుకోలేక చంపేయమన్నాను

by Pulgam srinivas |

సుప్రీత మాట్లాడుతూ… బరువు తగ్గే క్రమంలో తాను చేసిన తప్పుల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది.

Supritha: ఆ నరకం తట్టుకోలేక చంపేయమన్నాను
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటూ మంచి దశలో కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన జీవితంలో ఎదురైన కొన్ని కఠినమైన పరిస్థితుల గురించి వెల్లడించింది. సుప్రీత మాట్లాడుతూ… కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ జరిగిందని తెలిపింది. దాంతో తాను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అయితే త్వరగా బరువు తగ్గాలన్న ఆత్రుతలో కొన్ని తప్పులు చేశానని, దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించింది.

స్పీడ్‌గా బరువు తగ్గాలనే ఉద్దేశంతో కఠినమైన డైట్ ప్రారంభించానని, అందులో భాగంగా రోజుకు సుమారు 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండేదాన్ని చెప్పింది. ఇక తిన్న ఒక పూటలో కూడా లైట్ ఫుడ్ కాకుండా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకునేదాన్ని అని, దీంతో తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని, రోజుకు 15 సార్లు వాంతులు వచ్చేవని తెలిపింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందని, సుమారు 15 రోజుల పాటు బెడ్ రెస్ట్‌లో ఉన్నానని చెప్పింది. తీవ్రమైన వాంతుల కారణంగా ఆ బాధను తట్టుకోలేకపోయానని, ఆ సమయంలో “నన్ను చంపేయండి” అని కూడా హాస్పిటల్ సిబ్బందిని వేడుకున్నానని భావోద్వేగంగా తెలిపింది. చివరికి కోలుకొని సాధారణ స్థితికి వచ్చానని, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని సుప్రీత తాజాగా వెల్లడించింది.

Next Story