బాషా నిర్మాత మృతి.. సంతాపం ప్రకటించిన రజనీకాంత్

by Naga Rani Yarlagadda |

బాషా చిత్ర నిర్మాత మృతిపట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటించారు.

బాషా నిర్మాత మృతి.. సంతాపం ప్రకటించిన రజనీకాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: బాషా సినిమా నిర్మాత తమిళగన్ వృద్ధాప్య సమస్యలతో నిన్న (శనివారం) కాలం చేశారు. తాజాగా ఆయన మరణం పట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ సంతాపం ప్రకటించారు. అళగన్ తనకు సోదరుడులాంటి వాడని, ఆయన చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాషా సినిమా రజనీకాంత్ కెరీర్ కు పునాది లాంటిది. ఈ సినిమా తర్వాత ఆయన రేంజే మారిపోయింది. సురేశ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాను తమిళగన్, తల్లి రాజమ్మాళ్ కలిసి నిర్మించగా.. తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా ఉన్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన మూండ్రుముగం, పణక్కారన్, రాణువ వీరన్ సినిమాలను కూడా తమిళగనే నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే సినిమాలకు దర్శకత్వం వహించారు.

Next Story