‘భోగి’ నుంచి సూపర్ అప్డేట్.. అది క్లాస్.. ఇది పక్కా మాస్!

by Pulgam srinivas |

రేపు, మే 11 ఉదయం 11:07 గంటలకు ‘భోగి’ చిత్రంలో గన్‌పౌడర్‌లాంటి మాస్ పాత్రలో కనిపించబోయే నటి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

‘భోగి’ నుంచి సూపర్ అప్డేట్.. అది క్లాస్.. ఇది పక్కా మాస్!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో అనుపమ ఆకులు ఉన్న గంప పట్టుకుని క్లాస్ లుక్‌లో ఆకట్టుకుంది.

తాజాగా ఈ మూవీ బృందం మరో హీరోయిన్ డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రేపు, మే 11 ఉదయం 11:07 గంటలకు ‘భోగి’ చిత్రంలో గన్‌పౌడర్‌లాంటి మాస్ పాత్రలో కనిపించబోయే నటి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు భిన్నమైన షేడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. అనుపమ క్లాస్ లుక్‌లో కనిపించగా, డింపుల్ మాత్రం ఊర మాస్ అవతార్‌లో దర్శనమివ్వబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఆమె పాత్రపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 28, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.




Next Story