- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిల్ 'లెనిన్'లో సూపర్ ఐటమ్ సాంగ్
అఖిల్ ‘లెనిన్’లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్.. స్టార్ బ్యూటీ కోసం అన్వేషణ

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ చిత్రీకరణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్‌ను చేర్చాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగా, ఆ పాట కోసం ఓ స్టార్ బ్యూటీని ఎంపిక చేసే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అఖిల్ సినీ కెరీర్ ప్రారంభమై ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటివరకు ఆయనకు భారీ స్థాయి విజయం మాత్రం దక్కలేదు. దీంతో ‘లెనిన్’ చిత్రంతో అఖిల్ ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటాడనే నమ్మకంతో అక్కినేని అభిమానులు ఉన్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ ఎస్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.






