నిధి అగర్వాల్‌కు సూపర్ ఛాన్స్.. ఆ ముద్ర చెరిపేస్తుందా?

by Pulgam srinivas |

రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు, అందులో నిధి అగర్వాల్‌కు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిధి అగర్వాల్‌కు సూపర్ ఛాన్స్.. ఆ ముద్ర చెరిపేస్తుందా?
X

దిశ, వెబ్ డెస్క్: విజయాలు పెద్దగా లేకపోయినా మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ, నిధి అగర్వాల్‌కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇప్పటివరకు ఈమె పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మినహాయిస్తే పెద్దగా విజయాలు దక్కలేదు. తాజాగా ఈ హీరోయిన్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కొంతమంది నిధి అగర్వాల్‌కు ‘ఐరన్ లెగ్’ అనే ముద్రను కూడా వేశారు.

ఇక ఆ ముద్రను చెరిపేసే అవకాశం ఈ నటికి వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే నాలుగో చిత్రం కూడా విజయం సాధిస్తే నిధి అగర్వాల్‌కు ఉన్న ‘ఐరన్ లెగ్’ ఇమేజ్ ‘గోల్డెన్ లెగ్’గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story