- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunny Leone: ప్రెగ్నెన్సీని నేను ఇష్టపడలేదు.. కానీ పిల్లలు కావాలనుకుని ఆ పని చేశా.. సన్నీ లియోన్ షాకింగ్ కామెంట్స్
బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్.. ఫోర్న్ స్టార్‌గా పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్.. ఫోర్న్ స్టార్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంది. అలాగే తనకున్న సేవా గుణంతో ఎంతో మంది ప్రేక్షకుల ప్రేమను పొందుతుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. సన్నీ లియోన్‌కి ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. పండుగలు, ఏవైనా సెలబ్రేషన్స్ అప్పుడు తన ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే.. ఇందులో ఒక పాపను దత్తత తీసుకోగా.. ట్విన్స్ పిల్లల్ని (అబ్బాయిలు) సరోగసీ విధానం ద్వారా కన్నది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ బ్యూటీ.. తాను సరోగసీ విధానాన్ని ఎంచుకోవడానికి గల కారణాన్ని తెలిపింది.
‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం.. అందుకే మొదట ఒక బిడ్డను దత్తతు తీసుకోవాలి అనుకుని.. అడాప్షన్ కోసం అప్లై చేశాము. అలా పాపను తెచ్చుకున్నాము. నాకు ప్రెగ్నెన్నీ ఇష్టం లేదు. అందుకే సరోగసీ ద్వారా బిడ్డను కనాలి అనుకున్నాము. దానికి మాకు చాలా ఖర్చు అయింది. వాళ్లకు మేము వీక్లీ ఫీజులు చెల్లించేవాళ్లం. సరోగసీ మదర్ భర్త కూడా తనతోనే ఉండేలే చేసి అందుకు కూడా డబ్బులు ఇచ్చాము. ఇలా మేము ఇచ్చిన మనీతో వాళ్లు సొంతంగా ఇల్లు కూడా కొనుక్కున్నారు’ అని తెలిపింది. ప్రజెంట్ సన్నీ లియోన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవతున్నాయి. లింక్






