- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుర్ర హీరోయిన్‌తో సూపర్ స్టార్ రాసలీలలు.. కోర్టుకు ఎక్కిన భార్య..
హిందీ సూపర్ స్టార్, డ్యాన్సింగ్ ఐకాన్ గోవిందతో విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కింది భార్య సునీతా అహూజా. ఓ మరాఠీ కుర్ర హీరోయిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీని కారణంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. దీంతో సునీత గతేడాది డిశంబర్ 5న బాంద్రా

దిశ, వెబ్ డెస్క్ : హిందీ సూపర్ స్టార్, డ్యాన్సింగ్ ఐకాన్ గోవిందతో విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కింది భార్య సునీతా అహూజా. ఓ మరాఠీ కుర్ర హీరోయిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీని కారణంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. దీంతో సునీత గతేడాది డిశంబర్ 5న బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వ్యభిచారం, క్రూరత్వం, విడిచిపెట్టడం వంటి కారణాలను చూపుతూ డివోర్స్ కావాలని కోరింది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కేసు మీద కోర్టు కార్యకలాపాలు జరుగుతుండగా.. సునీత ప్రతిసారి హాజరైనా, గోవింద మాత్రం అటెండ్ కాకపోవడంతో కోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేసు కోర్టులో నడుస్తుండగా.. వీరిద్దరికి సన్నిహితుడైన న్యాయవాది లలిత్ బిందాల్.. ఇరువురిని ఒప్పించి.. మళ్లీ కలిసిపోవాలని కోరగా.. ఇందుకు ఒప్పుకున్నట్లు చెప్పాడు. కానీ కేసు కంటిన్యూ అవుతున్నట్లు సమాచారం.
ఇక గోవింద, సునీతకు కొడుకు, కూతురు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. సునీత రీసెంట్‌గా యూట్యూబ్ వ్లాగ్స్ స్టార్ట్ చేసింది. ఇందులోనూ పర్సనల్ విషయాలను షేర్ చేసుకునేట్లు కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలలో భర్త తనను మోసం చేసిన విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది.






