ఉగ్రదాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ శెట్టి .. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |

ఏప్రిల్ 22న మంగళవారం నాడు జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

ఉగ్రదాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ శెట్టి .. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: ఏప్రిల్ 22న మంగళవారం నాడు జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై దాడి చేయడంతో 26 మంది మరణించారు. అయితే ఇందులో చాలామంది కొత్తగా పెళ్లైన వ్యక్తులు ఉండటం విశేషం. జమ్మూ కాశ్మీర్ అందాలు ఆస్వాదించడానికి వెళ్లిన వారికి ఊహించని ఘటన ఎదురవడంతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విషాద ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఇక ఈ దాడి విషయంలో పాకిస్తాన్ హస్తం కూడా ఉన్నట్లు అనుమానపడుతూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రఏప్రిల్ 22న మంగళవారం నాడు జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఉగ్రదాడిపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి(Suniel Shetty) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘భగవంతుడు ప్రతిదీ చూస్తాడు.

ప్రస్తుతం భారతీయులుగా మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. భయం, ద్వేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. కాశ్మీర్ మనదే ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకు మనం చూపించాలి. అందుకేకాశ్మీర్‌లో నేను విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కాశ్మీర్‌లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేసి ఉగ్రవాదులపై ఎదురుదాడి చేయాలి. మన తదుపరి వెకేషన్ కాశ్మీర్‌లోనే ఉండాలి. ఎందుకంటే మనం వారి చేసిన దాడికి భయపడలేదని వారికి చూపించాలి. వీలైయితే నా సినిమాలు కూడా అక్కడే షూట్ చేద్దామని చెప్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు నిజం చెప్పారు మీరు సూపర్ సార్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story