సెన్సార్ పూర్తి చేసుకున్న సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ.. ఏ సర్టిఫికెట్ పొందిందంటే? (ట్వీట్)

by Mallepaka Hamsa |

యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) హిట్, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ.. ఏ సర్టిఫికెట్ పొందిందంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) హిట్, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక గత ఏడాది మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేసిన ఆయన ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ ‘మాజాకా’(Mazaka) సినిమాలో నటిస్తున్నారు. త్రినాధరావు నక్కిన(Trinadharao Nakkina) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రంలో రీతు వర్మ(Rithu Verma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్స్ రావు రామేష్(Rao Ramesh), అన్షు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ‘మజాకా’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ రాగా.. ప్రేక్షకుల్లో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ‌గా విడుదల కానుంది. రిలీజ్ సమయం దగ్గర పడటంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తమ సినిమాను ప్రేక్షకులు ఆదరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మాజాకా’ సెన్సార్ పూర్తి అయినట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుపుతూ సందీప్ కిషన్, రావు రమేష్ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే ఈ మూవీ సందీప్ 30వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది.

Next Story