- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌లో సందీప్ కిషన్.. పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన టీమ్
హీరో సందీప్ కిషన్‌తో శంభాల దర్శక,నిర్మాతలు ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని అనౌన్స్ చేశారు.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ ‘శంబాల’ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మరో ప్రాజెక్టుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్‌లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌కు క్రేజీ స్పందన లభిస్తుంది.
ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు మేకర్స్. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్ కాగా.. దీనిని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది చెబుతున్నారు చిత్ర బృందం. పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు






