రజనీకాంత్ , కమల్ హాసన్ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. అఫీషియల్ లెటర్‌తో షాక్ ఇచ్చిన డైరెక్టర్

by Chukka Sudharani |

రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రీసెంట్‌గా ఓ బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

రజనీకాంత్ , కమల్ హాసన్ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. అఫీషియల్ లెటర్‌తో షాక్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రీసెంట్‌గా ఓ బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ సుందర్ సి దీనికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. అయితే.. ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు అఫీషియల్‌గా లేఖ విడుదల చేసి అందరికి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ సుందర్ సి. ఈ మేరకు.. ‘బరువెక్కిన హృదయంతో కొన్ని ముఖ్యమైన వషయాలు మీతో పంచుకోవాలి అనకుంటున్నా.. కొన్ని అనివార్య కారణాల చేత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తలైవార్ 173 నుండి తప్పుకోవాలని నేను కష్టమైన నిర్ణయం తీసుకున్నాను.

లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ వెంచర్ నిజంగా నాకు ఒక కల. కానీ కొన్ని సార్లు మనకోసం నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాల్సిన క్షణాలు వచ్చినప్పుడు.. మన కలల నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తది. ఈ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా మేము పంచుకున్న ప్రత్యేక క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. రజనీకాంత్ , కమల్ హాసన్ ఇద్దరూ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తులు.. వారితో సినిమా చేయలేకపోతున్నప్పటికీ.. వారి నుంచి ఎప్పటిలాగే గైడెన్స్ స్వీకరిస్తాను. ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ వార్త నిరాశపరిచినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. మీ ప్రేమకు, మద్దతుకు ఎప్పుడు ధన్యవాదాలు.. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్యూ’ అని లెటర్ రిలీజ్ చేశారు. లింక్


Next Story