అంచనాలకు తగ్గకుండా ‘సుమతీ శతకం’

by Sujitha Rachapalli |

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సుమతీ శతకం’.

అంచనాలకు తగ్గకుండా ‘సుమతీ శతకం’
X

దిశ, సినిమా : విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సుమతీ శతకం’. అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ట్రైలర్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ నాయుడు మాట్లాడుతూ... ‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాత సాయి గారు. ఎక్కడా రాజీపడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మా హీరో అమర్ దీప్ గారు, మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే అద్భుతమైన నటన కనబరిచారు. గాయమైనా, సర్జరీ జరిగే పరిస్థితి వచ్చినా, సినిమా కోసం ఆ బాధను భరించి షూటింగ్ పూర్తి చేశారు. హీరోయిన్ శైలి తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న చిత్రం మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’ అని తెలిపాడు.

Next Story