‘న్యూటన్స్ థర్డ్ లా’ వచ్చేస్తున్నది.. రిలీజ్‌కు సిద్ధమైన అక్కినేని హీరో సినిమా

by Chukka Sudharani |

అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’.

‘న్యూటన్స్ థర్డ్ లా’ వచ్చేస్తున్నది.. రిలీజ్‌కు సిద్ధమైన అక్కినేని హీరో సినిమా
X

దిశ, సినిమా: అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. ‘ఏజెంట్ ఆఫ్ కర్మ’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫిజిక్స్ సూత్రమైన ‘ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే కాన్సెప్ట్‌తో ‘కర్మ సిద్ధాంతం’తో ముడిపెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమంత్.. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్‌తో రాబోతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ ఒరిజినల్ మూవీగా రూపొందుతున్న ‘న్యూటన్స్ థర్డ్ లా’ మే 15న విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ‘ఆగస్టు 7న ‘న్యూటన్స్ థర్డ్ లా’ మీ ముందుకు రాబోతుంది’ అంటూ ప్రకటించారు.

Next Story