మృణాల్ ఠాకూర్ తో పెళ్లి.. ఓపెన్ అయిన సుమంత్

by Bhanu |   (  Updated:2025-05-10 14:50:33  IST  )

హీరో సుమంత్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ల ప్రేమకథపై ఇటీవల సోషల్ మీడియాను ఊపేసిన రూమర్లు ఇప్పుడు ఓ కొత్త మలుపు తిరిగాయి.

మృణాల్ ఠాకూర్ తో పెళ్లి.. ఓపెన్ అయిన సుమంత్
X

దిశ, వెబ్ డెస్క్: హీరో సుమంత్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ల ప్రేమకథపై ఇటీవల సోషల్ మీడియాను ఊపేసిన రూమర్లు ఇప్పుడు ఓ కొత్త మలుపు తిరిగాయి. వారిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఓ ఫొటో వైరల్ కావడంతో, ‘‘ఇదేంటి? ఈ జంట డేటింగ్ చేస్తోందా? పెళ్లికి రెడీ అవుతున్నారా?’’ అంటూ నెటిజన్లు ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు. రూమర్లు పెద్దయెత్తున విస్తరించినా, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సుమంత్ ఎట్టకేలకు నిశ్శబ్దాన్ని చెదిపేశాడు.

తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ స్పష్టత ఇచ్చాడు – మృణాల్‌తో తనకెలాంటి వ్యక్తిగత సంబంధం లేదని తేల్చిచెప్పేశాడు. ‘‘ఆ ఫొటో సీతారామం మూవీ సమయంలో దిగిందే. అప్పటి బిగ్ ప్రమోషన్ భాగంగా తీసుకున్న ఫొటోను ఇప్పుడు బయటకు తీసుకొచ్చి ప్రేమ కథలు అల్లుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే, ఆ సినిమా తర్వాత మృణాల్‌తో నేను కనీసం సంప్రదింపులో కూడా లేను. నా జీవితంలో పెళ్లి అనే ఆలోచననే లేదు. ప్రస్తుతం నా లైఫ్ సెట్ అయింది. సినిమాలు చూడడం, జిమ్, స్పోర్ట్స్... ఇవే నాకు సరిపోతున్నాయి’’ అంటూ తన స్టైలులో క్లారిటీ ఇచ్చేశాడు.

సుమంత్ మాటల్లోనుంచి తేలినది ఏంటంటే – పెళ్లంటే మచ్చుకు కూడా ఆలోచించడంలేదు. గతంలో ఓసారి పెళ్లి చేసి విడాకులు తీసుకున్న ఆయన, అప్పటి నుంచి పూర్తిగా సింగిల్ గానే ఉంటున్నారు. ప్రస్తుతం ‘‘అనగనగా’’ అనే కొత్త సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సుమంత్, ఈసారి కూడా తనకు ప్రత్యేకంగా నప్పే క్లాస్ టచ్ ఉన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ట్రైలర్‌కు వచ్చిన మంచి రెస్పాన్స్ చూస్తుంటే, ఈ ప్రయోగం వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంతో సుమంత్-మృణాల్ రూమర్లకు ఓ క్లియర్ కట్ ఫుల్ స్టాప్ పడినట్టేనా!

Next Story