‘పుష్ప’ యూనివర్స్‌లో రామ్ చరణ్.. సుకుమార్ భారీ ప్లాన్

by Sujitha Rachapalli |

ఫిల్మ్ సర్కిల్‌లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. ‘ఎవడు’ మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చెర్రీ అప్ కమింగ్ ఫిల్మ్ #RC17లో

‘పుష్ప’ యూనివర్స్‌లో రామ్ చరణ్.. సుకుమార్ భారీ ప్లాన్
X

దిశ, సినిమా : ఫిల్మ్ సర్కిల్‌లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. ‘ఎవడు’ మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చెర్రీ అప్ కమింగ్ ఫిల్మ్ #RC17లో ఈ కాంబోను ఫ్యాన్స్ చూడబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని ‘పుష్ప’ యూనివర్స్‌లో భాగం చేస్తారని.. చరణ్ క్యారెక్టర్ పుష్ప రాజ్ పాత్రతో కలవబోతుందని.. మునుపెన్నడూ లేని విధంగా సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తీర్చిదిద్దబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ చిత్రం ఎండింగ్ ‘పుష్ప 3’కి లింక్ చేయబడుతుందనేది ఇండస్ట్రీ టాక్. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడయాలో వైరల్ అవుతుండగా.. మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వీరిద్దరిని ఒకే యూనివర్స్, ఒకే ఫ్రేమ్‌లో ఊహించుకోవడమే గూస్ బంప్స్ తెప్పిస్తుందని.. ఇదే నిజంగా జరిగితే థియేటర్స్ బద్ధలైపోతాయని.. బాక్సాఫీస్ షేక్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.

Next Story