Pushpa-3: పుష్ప-3 పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో పుష్ప 2 చిత్రం ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది.

Pushpa-3: పుష్ప-3 పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో పుష్ప 2 చిత్రం ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇందులో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక అవార్డులు అందుకోగా.. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. దీంతో సైమా అవార్డ్స్ అందుకుంటూ స్టేజ్‌పై సందడి చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే పుష్ప 3 ఉంటుందా అనే ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంటుంది’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప-3: ది ర్యాంపేజ్ ఉంటుందనే అనౌన్స్‌మెంట్ రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story