- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sukumar: '1: Nenokkadine' అలా చేసుంటే పెద్ద హిట్ అయ్యేది.. నేనే మిస్టేక్ చేసా
'1 నేనొక్కడినే' ఫ్లాప్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన సుకుమార్

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘1 నేనొక్కడినే’ చిత్రం 2014 సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ ఓపెన్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ… “నేను చేసిన ఒక తప్పు వల్లే ‘1 నేనొక్కడినే’ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేదేమో అనిపిస్తుంది. వాస్తవానికి ఆ సినిమా స్టోరీ రాసిన తర్వాత మేము రెండు రకాల స్క్రీన్‌ప్లేలను అనుకున్నాం. మొదటి వెర్షన్‌లో ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోకు ఎలాంటి వ్యాధి ఉండదు, మొత్తం ఒక నాటకం ఆడుతూ అందరిని మోసం చేస్తున్నట్లు చూపించాలని భావించాం. రెండో వెర్షన్ మాత్రం ఇప్పుడు ప్రేక్షకులు చూసిన విధంగానే ఉంటుంది. హీరోకు ఎలాంటి వ్యాధి లేకుండా అందరిని మోసం చేస్తున్నట్లు చూపిస్తే ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ రాదనే ఉద్దేశంతో మేము ప్రస్తుతం ఉన్న స్క్రీన్‌ప్లే వైపు మొగ్గు చూపాం.
అయితే మేము అనుకున్న ఆ రెండో రకం స్క్రీన్‌ప్లేను కూడా పూర్తిగా షూట్ చేసి, రెండు వెర్షన్‌లను పక్కపక్కన చూసుకుని నిర్ణయం తీసుకుని ఉంటే మా అభిప్రాయం మారేదేమో. అలా చేసి ఉంటే సినిమా మరింత మంచి ఫలితాన్ని సాధించి ఉండేదేమో అని తర్వాత అనిపించింది” అని సుకుమార్ వెల్లడించారు. విడుదల సమయంలో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచిన ఈ సినిమా, తర్వాత కాలంలో మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సంపాదించుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాజర్ విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.






