సుజీత్ ప్లాన్ అదిరింది.. 'బ్లడీ రోమియో'కు డెడ్‌లైన్ ఫిక్స్

by Pulgam srinivas |

ఆరు నెలల్లో బ్లడీ రోమియో చిత్రాన్ని పూర్తి చేసి, ఆ వెంటనే ఓజీ 2ను ప్రారంభించాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సుజీత్ ప్లాన్ అదిరింది.. బ్లడీ రోమియోకు డెడ్‌లైన్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులలో సుజిత్ ఒకరు. ఈయన రన్ రాజా రన్ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ దర్శకుడికి తిరుగులేదని, వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లిపోతాడని చాలామంది అనుకున్నారు. కానీ ఈయన కెరీర్ అత్యంత స్లోగా ముందుకు సాగింది. రన్ రాజా రన్ విడుదలై ఇప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఈ దర్శకుడి నుండి కేవలం సాహో, ఓజీ చిత్రాలు మాత్రమే వచ్చాయి. దీంతోనే ఈయన కెరీర్ ఎంత స్లోగా ముందుకు సాగిందో అర్థమవుతుంది. ఈ దర్శకుడు తన తదుపరి మూవీని నానితో చేయబోతున్నాడు.

ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీకి "బ్లడీ రోమియో" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంతకాలం పాటు స్లోగా కెరీర్‌ను కొనసాగించిన ఈ దర్శకుడు ఇకపై జెట్ స్పీడ్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. "బ్లడీ రోమియో" చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేయాలని సుజిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ వెంటనే 2027 చివరలో పవన్ కళ్యాణ్ హీరోగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లలో "ఓజీ 2" చిత్రాన్ని ప్రారంభించాలని ఈ యంగ్ డైరెక్టర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడి ప్లాన్స్ వర్కౌట్ అయితే, చాలా వేగంగా ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి తన కెరీర్‌ను కొత్త స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.

Next Story