- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుహాస్ ‘హే భగవాన్’ టీజర్ రిలీజ్.. పొట్ట చెక్కలయ్యే కామెడీతో హిలేరియస్..
‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాతో హీరోగా పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan).

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాతో హీరోగా పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan). గోపి అచ్చర(Gopi Achara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని నాగరం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటిస్తోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి(Narendra Reddy) నిర్మిస్తున్న ఈ మూవీకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 20, 2026న విడుదల కానుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌తో పాటు ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. ఒక రహస్యమైన ‘ఫ్యామిలీ బిజినెస్’ చుట్టూ తిరిగే ఈ కథలో ఆ వ్యాపారం ఏంటో ఎవరికీ చెప్పకూడదనే ఆసక్తికర నిబంధనతో సాగే తండ్రీకొడుకుల ప్రయాణం హిలేరియస్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సీనియర్ నటుడు నరేష్ వి.కె సుహాస్ మధ్య సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.






