Suhana Khan: ఫస్ట్ టైమ్ తండ్రి సినిమాలో నటించనున్న స్టార్ కిడ్.. సూపర్ ఎక్జైటెడ్ అంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) ప్రస్తుతం ‘కింగ్’ (King) చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Suhana Khan: ఫస్ట్ టైమ్ తండ్రి సినిమాలో నటించనున్న స్టార్ కిడ్.. సూపర్ ఎక్జైటెడ్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) ప్రస్తుతం ‘కింగ్’ (King) చిత్రంతో బిజీగా ఉన్నాడు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ (Revenge action thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. ‘పఠాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో.. ఇప్పుడు ‘కింగ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), అభయ్ వర్మ, రాని ముఖర్జీ తదితరులు కూడా ప్రదాన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో షారుఖ్ ఖాన్ గరాలపట్టి సహానా ఖాన్ నటిస్తున్నట్లు బాలవుడ్ సినీ వర్గాల నుంచి సమాచారం. సుహాన షారుఖ్ ఖాన్ కూతురు పాత్రలో నటిస్తుండగా.. తల్లిగా దీపికా పదుకొణె నటించనుందని తెలుస్తుంది. ఇక మే-22 సుహానా బర్త్‌డే కావడంతో.. ఆసందర్భంగా ‘కింగ్’ సెట్‌లోకి అడుగుపెట్టనుందట ఈ స్టార్ కిడ్. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story