Sudheer Babu: బర్త్‌డే స్పెషల్.. సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా నుంచి లుక్ రిలీజ్

by Chukka Sudharani |

హీరో సుధీర్ బాబు (Sudheer Babu) డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

Sudheer Babu: బర్త్‌డే స్పెషల్.. సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా నుంచి లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: హీరో సుధీర్ బాబు (Sudheer Babu) డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నేడు సుధీర్ బాబు బర్త్‌డే కావడంతో.. ఈ స్పెషల్‌గా సుధీర్ బాబు నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా.. ఆయన నటిస్తున్న ‘జటాధర’ (Jatadhara) చిత్రం నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ పోస్టర్‌లో సుధీర్ బాబు సీరియస్‌గా ఏదో చూస్తున్నట్లు తెలుస్తుండగా.. ప్రజెంట్ ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. నేచురల్ హారర్ ఫాంటసీ (Natural Horror Fantasy) థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) దర్శకత్వం విహిస్తుండగా.. బాలీవుడ్ (Bollywood) నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ (Zee Studios) నిర్మిస్తుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.హీరో సుధీర్ బాబు (Sudheer Babu) డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

Next Story