- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aditya Roy Kapoor : మరో బాలీవుడ్ స్టార్ నటుడి ఇంట్లోకి ఆగంతకుల ప్రవేశం.. అరెస్ట్
సైఫ్ అలీఖాన్(Saif Alikhan Murder Attack) ఇంట్లో దాడి, హత్యాయత్నం ఘటన మరవక ముందే మరో బాలీవుడ్ నటుడి ఇంట్లో ఆగంతకులు ప్రవేశించేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : సైఫ్ అలీఖాన్(Saif Alikhan Murder Attack) ఇంట్లో దాడి, హత్యాయత్నం ఘటన మరవక ముందే మరో బాలీవుడ్ నటుడి ఇంట్లో ఆగంతకులు ప్రవేశించేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapoor) ఇంట్లోకి దుబాయ్‌కు చెందిన 47 ఏళ్ల మహిళ గజాలా జకారియా సిద్దిఖీ ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్టు సమాచారం. ముంబై(Mumbai)లోని బాంద్రా వెస్ట్(Bandra)లోని రిజ్వీ కాంప్లెక్స్‌లోకి సదరు మహిళ చొరబడేందుకు ప్రయత్నం చేసినట్టు సెక్యూరిటీ సిబ్బంది పేర్కొన్నారు.
అయితే తాను ఆదిత్యకు బట్టలు, బహుమతులు ఇవ్వడానికి వచ్చానని, 6 గంటలకు అపాయింట్‌మెంట్ ఉందని చెప్పి, ఇంట్లో పనిచేసే సంగీతా పవార్‌ను నమ్మించి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో ఆదిత్య షూటింగ్ కోసం బయట ఉన్నాడు. ఆదిత్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెను చూసి గుర్తుపట్టలేదు. ఆమె ఆదిత్య మీదికి దూసుకురాగా.. వెంటనే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాలని తన మేనేజర్‌లకు సమాచారం ఇచ్చాడు. సంగీతా ఆమెను బయటకు వెళ్లమని చెప్పినా ఆమె నిరాకరించింది.
మేనేజర్ శ్రుతి రావు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని బాంద్రా డివిజన్ ఏసీపీ అధిక్‌రావ్ పోల్ తెలిపారు. కాగా ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంట్లోకి కూడా ఓ ఆగంతకుడు ఇలాగే చొరబడే ప్రయత్నం చేయడంతో.. ప్రస్తుతం బాలీవుడ్ నటుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.






