- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
STR- 49: పూజతో పిచ్చి మొదలవుతుంది.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు
తమిళ స్టార్ హీరో సిలంబరసన్ (Silambarasan) (సింబు), నటుడు సంతానం (Santhanam) కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘STR- 49’.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సిలంబరసన్ (Silambarasan) (సింబు), నటుడు సంతానం (Santhanam) కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘STR- 49’. కార్తిక్ థంగావెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ కయాదు లోహర్ (Kayad Lohar) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంటూ.. ‘మీరందరూ ఎదురుచూస్తున్న కలయిక రానే వస్తుంది.. సిలంబరసర్ అండ్ సంతానం STR49 కోసం తిరిగి కలవడం సంతోషం. ఈరోజు పూజతో పిచ్చి మొదలవుతుంది’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట విశేషంగా వైరల్ అవుతున్నాయి.






