- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అఖండ-2’ మూవీ విడుదలను ఆపండి.. మద్రాసు హైకోర్టు సంచలన ఆదేశాలు
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ-2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ-2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. రేపు (డిసెంబర్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా, కోర్టు స్టే విధించడంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మూవీ విడుదలకు బ్రేక్ పడటానికి ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీ మధ్య జరుగుతున్న ఆర్థిక వివాదమే ప్రధాన కారణం.
కాగా, గతంలో జరిగిన ఆర్బిట్రేషన్ కేసులో ఈరోస్ సంస్థ గెలిచింది. 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీపై సుమారు రూ.28 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చింది. కానీ, ఆ సంస్థ నిర్మాతలు ఇంకా తమకు నగదు చెల్లించలేదని ఈరోస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ‘అఖండ-2’ సినిమాను ఎటువంటి రూపంలోనూ విడుదల చేయొద్దని, థియేటర్లు, ఓటీటీ, సాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ కూడా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, మూవీ రిలీజ్ విషయంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, మూవీ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.






