- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్ర కులానికి చెందినవాళ్లు వారితో సమానం.. సంచలన పోస్ట్ పెట్టిన స్టార్ సింగర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి (Chinmayi Sripada) ఒకప్పుడు ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి (Chinmayi Sripada) ఒకప్పుడు ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఆమె సమంత(Samantha)కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే మీటూ ఉద్యమంలోనూ పాల్గొంది. కానీ గత కొద్ది కాలంగా సింగింగ్‌కు దూరంగా ఉంటున్న చిన్మయి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, చిన్మయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ‘‘నేను తక్కువ కులానికి చెందినదానిని. అది షెడ్యూల్డ్ తెగ, హిందువులు అని పిలవబడే వారిలో నేను కూడా ఒక్కిరిన అనే విషయాన్ని మర్చిపోయాను. దానికి కారణం నా చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన. మా ఊరి దేవాలయానికి వెళ్లినప్పుడు పూజారి నాకు నేరుగా ప్రసాదం ఇవ్వలేదు. అలాగే నా కాలేజీ రోజుల్లోనూ అలాంటివి చాలానే జరిగాయి.
రిజర్వేషన్ల వల్ల మీరంతా మా నెత్తిపై కూర్చున్నారని మా లెక్చరర్ అనేవారు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను. చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ నేను చాలా నే ఫేస్ చేశాను. అగ్ర కులానికి చెందినవాళ్లు, కులం ఆధారంగా తక్కువ చేసి చూసే వాళ్లందరూ కూడా టెర్రరిస్టులతో సమానంగా కనిపిస్తారు. ఎందుకంటే వీళ్లందరూ ఒకప్పుడు నా మానసిక పరిస్థితిని బాగా ఇబ్బంది పెట్టినవాళ్లే. కులం చూసి కొందరు చంపేస్తున్నారు. కులం ఆధిపత్యం చూపించి మరికొందరు మానసికంగా హింసించి చంపేస్తున్నారు’’ అని రాసుకొచ్చింది. అయితే ఆమె పహల్గాం ఉగ్రదాడి గురించి ఇలాంటి పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. 26 మంది అమాయకులు చనిపోతే ఇలాంటి పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం పోస్ట్ పెట్టిన టైమింగ్ సూపర్ అనిఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కొంతమంది ఏకంగా కులాన్ని, మతాన్ని బ్యాన్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.






