బోల్డ్ అండ్ బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటున్న స్టార్ నిర్మాత.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-15 13:38:19.0  )
బోల్డ్ అండ్ బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటున్న స్టార్ నిర్మాత.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు (Dil Raju)పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి లాభాలు పొందారు. ఎన్నో సినిమాలు తెరకెక్కించిన ఆయన పలు హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌(Sri Venkateswara Creations) ద్వారా కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఇటీవల ఆయన నిర్మాణంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’(Game Changer) బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాత్రం ఘన విజయాన్ని సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో అదే ఫామ్‌లో ఉన్నారు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు, నితిన్ (Nithin)‘తమ్ముడు’ వంటి చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఆయన నిర్మాతగానే కాకుండా.. తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, దిల్ రాజు ఓ ఆసక్తికర ట్వీట్ చేసి అందరిలో క్యూరియాసిటీని పెంచారు. ఏప్రిల్ 16న ఉదయం 11:08 గంటలకు బోల్డ్ అండ్ బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు ప్రకటిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది సినిమాకు సంబంధించిన అప్డేట్ కాదని సమాచారం. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అసలు అదేంటో తెలుసుకోవాలని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed