‘సయారా’ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ కిడ్.. రొమాంటిక్ వీడియోను షేర్ చేస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-31 08:40:44  IST  )

బాలీవుడ్ స్టార్ నటుడు చుంకీ పాండే(Chunky Pandey) తనయుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.

‘సయారా’ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ కిడ్.. రొమాంటిక్ వీడియోను షేర్ చేస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు చుంకీ పాండే(Chunky Pandey) తనయుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన కూతురు అనన్య పాండే(Ananya Pandey) సినీ పరిశ్రమలోకి వచ్చి హిందీ, తెలుగు హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇప్పుడు ఆయన కొడుకు అహాన్ పాండే (Ahan Pandey)హీరోగా పరిచయం కాబోతున్నాడు. ‘సయారా’(Saiyaara )తో రాబోతున్న ఈ సినిమాను మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం అనీత్ పెద్దా హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్షయ్ విధాని(Akshay Vidhani), ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుకుంటున్న ఈ మూవీ జూలై 18న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘సయారా’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో అహాన్ పాండే బీడీ తాగుతూ రౌడీ బాయ్‌గా కనిపించగా.. అనీత్ పెద్ది అమాయకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరు పబ్‌లో కలుసుకుని లిప్ లాక్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత వాటర్‌లోనూ రొమాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. బైక్‌పై వెళ్తూ కూడా లిప్‌లాక్ ఇచ్చుకుంటూ రెచ్చిపోయిన హీరోహీరోయిన్ ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో విడిపోతారు. ఆ తర్వాత ఒక స్టేజ్‌పై అహాన్ నడుస్తుండగా.. రోడ్‌పై అనీత్ ఎడుస్తూ కనిపించింది. అంతటితో టీజర్ ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story