- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించండి.. కోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో భార్య
తమిళ నటుడు జయం రవి(Jayam Ravi), ఆయన భార్య ఆర్తి(Arti)కి మధ్య గతకొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నటుడు జయం రవి(Jayam Ravi), ఆయన భార్య ఆర్తి(Arti)కి మధ్య గతకొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ విడాకుల వరకూ వెళ్లారు. తాజాగా ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జయం రవి భార్య ఆర్తి మరోసారి కోర్టు మెట్లు ఎక్కింది. విడాకుల కేసులో భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు విచారణను జూన్ 12కి వాయిదా వేసింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా జయం రవి, గాయని కెనీషా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక వివాహ వేడుకకు హాజరుకావడం, ఆ సందర్భంలోని ఫోటోలు బయటకు రావడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆర్తి విడాకుల కేసులో దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జయం రవి, గాయని కెనీషా మధ్య సన్నిహిత సంబంధాలపై స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పరోక్ష పోస్టు కూడా పెట్టారు. తీవ్ర ఆవేదనతో కూడిన పోస్ట్‌ను షేర్ చేయడంతో అభిమానులు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా, భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్టు జయం రవి ప్రకటించి ఏడాది పూర్తవడం గమనార్హం.






