40 ఏళ్ల వయసులో లవర్‌ను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. జీవితంలోకి వెలుగు వచ్చిందంటూ పోస్ట్

by Hamsa |
40 ఏళ్ల వయసులో లవర్‌ను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. జీవితంలోకి  వెలుగు వచ్చిందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష(Trisha Krishnan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు 2002లో ‘మౌనం పెసియాదేలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రభాస్ సరసన ‘వర్షం’(Varsham) మూవీలో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు(Mahesh Babu), విజయ్, శింబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగార్జున(Nagarjuna), వెంకటేష్, ఎన్టీఆర్, బాలకృష్ణ, రజినీకాంత్(Rajinikanth) వంటి స్టార్స్ సరసన నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

గత కొన్నేళ్ల నుంచి త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక 40 ఏళ్లు వచ్చినప్పటికీ ఈ అమ్మడు పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఆమె ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. త్రిష ఇటీవల విదాముయార్చి(Vidaamuyarchi), ఐడెంటిటీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, తగ్ లైఫ్ వంటి సినిమాల్లో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీస్ త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే.. త్రిష వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ భామ తన వాలెంటైన్‌ను పరిచయం చేసి షాకిచ్చింది. తన లవర్ పెట్ డాగ్ అని చెప్తూ దాని ఫొటోలు షేర్ చేస్తూ ‘‘ఫిబ్రవరి 2,2025.. నేను ఇజ్జీని దత్తత తీసుకున్న రోజు. ఆమె నన్ను రక్షించింది. ఆమెను నాకు ఇచ్చి నా జీవితంలోకి వెలుగు వచ్చేలా చేసినందుకు లోగేష్ బాలాచంద్రన్‌‌కు ధన్యవాదాలు. నా కోసం దేవుడు పంపిన చిన్నారి. ఎప్పటికీ నువ్వే నా వాలెంటైన్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ కొందరు ఓ మై గాడ్ అని షాక్ అవుతుంటే మరికొందరు మాత్రం చాలా క్యూట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed