- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ సేతుపతి సినిమాలో డైనమిక్ విలన్‌గా స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath), కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath), కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్(Charmi Kaur) నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రకటనతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈక్రమంలోనే.. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు (tabu) నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇందులో ఆమె కీలక పాత్రలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ఈ విషయంపై పూరీ జగన్నాథ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ ఆమె ఓ ఎలక్ట్రిక్.. ఒక పేలుడు.. భారతీయ సినిమా రత్నాన్ని సగర్వంగా స్వాగతిస్తున్న నటి టబు డైనమిక్ పాత్రలో నటించబోతుంది. విజయ్ సేతుపతి చిత్రంలో భాగం కానుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే టబుతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు.






