ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ జంటకు పెళ్లి అయి నిన్నటితో వన్ ఇయర్ అవుతుంది. దీంతో వీరిద్దరు కలిసి తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని (First Wedding Anniversary) జరుపుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి తమ వివాహ వేడుకకు సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియోలో పెళ్లికి ముందు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకల సందడితో పాటు, గోవాలో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహ ఘట్టాలు ఉన్నాయి.

భర్త ఆంటోనితో కలిసి ఆమె చేసిన సరదా డ్యాన్స్‌లు, ప్రేమతో ఒకరినొకరు హగ్ చేసుకోవడం, పెళ్లి వేదికపై ఆంటోనిని చూసి కీర్తి ఆప్యాయంగా నవ్వే సీన్స్ అన్ని అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ జోడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story