- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balayya: బాలకృష్ణ కాళ్లు మొక్కిన టాలీవుడ్ హీరోయిన్ !
టాలీవుడ్ అగ్ర హీరో, TDP ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ( Nandamuri Balayya) అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ ( Sanyukta

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ అగ్ర హీరో, TDP ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ( Nandamuri Balayya) అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ ( Sanyukta Menon) మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నందమూరి బాలయ్య అంటే ఓ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి నందమూరి బాలయ్య ఆశీర్వాదం తీసుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. నందమూరి బాలయ్య కాళ్లు మొక్కి.. అందరికీ షాక్ ఇచ్చిన సంయుక్త మీనన్.. ఆయన ఆశీర్వాదం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ( Eluru ) నిన్న జువెలరీ షాప్ ప్రారంభమైంది. ఈ జువెలరీ షాప్ ను హీరోయిన్ సంయుక్త మీనన్ అలాగే నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలోనే.... బాలకృష్ణ కొంతమందితో మాట్లాడుతుండగా... వెనుక నుంచి వెళ్లి ఆయన కాళ్లపై పడింది హీరోయిన్ సంయుక్త మీనన్. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా షాక్ అయిన నందమూరి బాలయ్య.. ఆ తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆమెను దీవించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా నందమూరి బాలయ్య.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా దూసుకు వెళ్తున్నారు. 60 సంవత్సరాల వయసులో కూడా బ్లాక్ బాస్టర్ సినిమాలు చేస్తూ... చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేయడమే నందమూరి బాలయ్య సక్సెస్. ఈ మధ్యకాలంలో నాలుగు సినిమాలు కూడా వరుసగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. త్వరలోనే అఖండ 2 సినిమాతో కూడా రాబోతున్నారు నందమూరి బాలయ్య.






