- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మనం సాధారణంగా అడగడానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నల్ని అడిగాను.. రేపు YouTubeలో విడుదలచేయబోతున్నామంటూ సమంత పోస్ట్
బ్యూటిఫుల్ అగ్ర తార సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ అగ్ర తార సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీకి కేవలం కోట్లలో కుర్రాళ్ల ఫాలోయింగ్ మాత్రమే కాదు.. లేడీ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సామ్, నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తిలేదు. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్. తనలోని ప్రతి ఒక ప్రతిభను జనాల ముందు ఉంచి.. మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది.
ఆల్మోస్ట్ సామ్ నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. సామ్ ఇటీవలే శుభం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ మొదటిసారిగా నిర్మించిన చిత్రం కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సమంత ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇకపోతే సామ్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి రోజూ సోషల్ మీడియాలోని అభిమానులతో మాత్రం తప్పకుండా టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ నటి నెట్టిం ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కు ‘‘ఈ ఎపిసోడ్‌లో మన పీరియడ్స్ నెలవారీ రిపోర్ట్ కార్డ్ లాంటిదని నేను తెలుసుకున్నాను.
మనలో చాలా మందికి దానిని ఎలా చదవాలో తెలియదు. అదృష్టవశాత్తూ, మహిళల ఆరోగ్యంపై నిపుణుడు @rashichowdhary దాని గురించి వివరిస్తున్నారు. లక్షణాలు, ఎర్ర జెండాలు, ఇంటి నివారణలు, సప్లిమెంట్లు, పనులు వంటివి. మనం సాధారణంగా అడగడానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నలను నేను అడిగాను. నేను చాలా నేర్చుకున్నాను. మీరు కూడా అలా చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మా కొత్త ఎపిసోడ్ రేపు YouTubeలో విడుదల అవుతుంది. మీరు దీన్ని చూడాలని అనుకునే వారిని ట్యాగ్ చేయండి. #Take20 #PeriodHealth #WomensWellness #HormoneHealth #SamanthaRuthPrabhu #rashichowdhary’’ అని సామ్ ఈ ట్యాగ్స్ కూడా జత చేసింది.






