- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విశ్వంభర’ నుంచి స్టార్ హీరోయిన్ పోస్టర్ విడుదల.. వావ్, సో క్యూట్ అంటున్న నెటిజన్లు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). వశిష్ట(Vasishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. సోసియో-ఫాంటసీ ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎం. ఎం. కీరవాణి వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో త్రిష(Trisha), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నట్టు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే9న థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఈక్రమంలో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, స్టార్ హీరోయిన్ త్రిష పుట్టినరోజు కావడంతో చిత్రబృందం అప్డేట్ ఇచ్చారు. ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ అమ్మడు ఇందులో అవని పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘తన ఆకర్షణ, తేజస్సుతో అవని పాత్రకు ప్రాణం పోసింది. మీరు త్వరలో దానిని చూస్తారు. సినిమాల్లో మెగా మాస్ బియాండ్ యూనివర్స్’’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే విడుదల చేసిన పోస్టర్‌లో త్రిష అద్భుతంగా ఉంది. గోల్డ్, మెరున్ కలర్ చీరలో యువరాణిలా కనిపించిన త్రిష లుక్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు చాలా క్యూట్ ఉందని కామెంట్లు చేస్తున్నారు.






