Kuberaa: "కుబేర"లో నాగార్జున పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో !

by velandi.Saikiran |

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), తమిళ్ హీరో ధనుష్ ( Dhanush), రష్మిక ( Rashmika) కాంబినేషన్ లో వచ్చిన తాజా సిని

Kuberaa: కుబేరలో నాగార్జున పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో !
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), తమిళ్ హీరో ధనుష్ ( Dhanush), రష్మిక ( Rashmika) కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా కుబేర ( Kuberaa). టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల ( Shekhar kammula) ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీశారు. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. గత మూడు రోజులుగా కలెక్షన్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఈ కుబేర సినిమాకు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో... అది కూడా ప్లస్ అయింది.

ఈ సినిమాలో ధనుష్, నాగార్జున అలాగే రష్మిక చుట్టే కథ తిరుగుతుందని చెబుతున్నారు. నాగార్జున నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో నాగార్జున పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున పాత్రను మొదట... మరొకరితో చేయాలని అనుకున్నారట శేఖర్ కమ్ముల. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ( Mohan lal) ఈ పాత్ర కోసం మొదట అడిగినట్లు తెలుస్తోంది.

కథ మొత్తం చెప్పిన తర్వాత... ఆయన రిజెక్ట్ చేశారట. దీంతో వెంటనే నాగార్జున తోనే ఈ సినిమా చేయాలని శేఖర్ కమ్ముల డిసైడ్ అయి... సక్సెస్ అయ్యారు. మోహన్ లాల్ దగ్గరకు వెళ్లిన తర్వాత వెంటనే నాగార్జున దగ్గరికి వెళ్లి కథ చెప్పారట. కథ బాగుందని చెప్పడంతో వెంటనే సినిమా ఫినిష్ చేసి సక్సెస్ అందుకున్నారు. అలా నాగార్జున వద్దకు ఈ సినిమా వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Next Story